టీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయత్నం.. త్వరలోనే డ్రైవింగ్ స్కూల్స్..

ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసే టీఎస్ఆర్టీసీ.. ఇటీవల కార్గో సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో అడుగు ముందుకేసి రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

టీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయత్నం.. త్వరలోనే డ్రైవింగ్ స్కూల్స్..

Updated on: Jul 16, 2020 | 1:41 AM

RTC Driving Schools: ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసే టీఎస్ఆర్టీసీ.. ఇటీవల కార్గో సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో అడుగు ముందుకేసి రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదటిగా హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఈ స్కూల్స్‌ను ఏర్పాటు చేసేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ సుమారు రూ.700 కోట్లు నష్టపోయింది. ప్రస్తుతం పరిమితి సంఖ్యలో బస్సు సర్వీసులను నడుపుతున్నా.. ఆదాయం అంతంతమాత్రంగానే వస్తోంది. దీనితో ప్రత్యామ్నాయంగా త్వరలోనే మూడు డ్రైవింగ్ స్కూల్స్‌ను ప్రారంభించనుంది. ఈ శిక్షణా కేంద్రాల్లో కార్ల దగ్గర నుంచి భారీ వాహనాల వరకు అన్నింటిని నడిపే విధంగా శిక్షణ ఇవ్వనుంది. కాగా, ఈ డ్రైవింగ్ స్కూల్స్‌లో శిక్షణకు ఇంకా ఫీజు నిర్ణయించలేదు. అటు మొత్తం శిక్షణ 40 రోజులు ఉండే విధంగా.. అందులో 10 రోజులు థియరీ క్లాసులు, 30 రోజులు ప్రాక్టికల్స్ ఉండేలా అధికారులు షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

డిజిటల్ వార్.. చైనాకు మరో భారీ షాక్.. హువావేపై నిషేధం..