
సంచలనాలకు కేరాఫ్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నాళ్ల నుంచి ఏపీ రాజకీయాలపై వరుసగా ట్వీట్స్ చేస్తూ అందరి దృష్టిని తనపై తిప్పుకుంటున్నాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాపాడగలరంటూ ట్వీట్ చేశారు. అప్పుడే ప్రజలు టీడీపీ ఓటమిని మరిచిపోతారని ట్వీట్ చేశారు. అంతేకాదు… మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే అది తారక్ ఒక్కడేనన్నారు వర్మ. జూనియర్ ఎన్టీఆర్‌కు తాత ఎన్టీఆర్‌పై ఏ మాత్రం అభిమానం ఉన్నా.. వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతల్ని తన భుజాలపై వేసుకోవాలంటూ మరో ట్వీట్ చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మరాయి.