కరోనాతో కుదేలైన సినీరంగం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఒక్కో సినిమా షూటింగ్ మెల్లమెల్లగా సెట్ లోకి వెళ్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన తదుపరి చిత్రం ప్రారంభించేందుకు రెడీ అయ్యారని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’’. ఇందులో మీనా, కుష్బూ, కీర్తీ సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మొదట్లో ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ప్లాన్ చేశారు. అయితే, కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న పరిస్థితుల దృష్ట్యా పక్క రాష్ట్రంలో ఎక్కువ శాతం షూటింగ్ చేయడం కరెక్ట్ కాదని చిత్రం యూనిట్ భావిస్తోంది చాలా రిస్క్ తో కూడుకున్నదని, చెన్నైలోనే ఓ భారీ సెట్ ను నిర్మిస్తోందట. మిగతా భాగాన్ని అక్కడే పూర్తి చేయాలన్నది ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నట్లు సన్ పిక్చర్స్ ఇదివరకే ప్రకటించింది.