‘చౌకీదార్ చోర్’ కామెంట్.. సుప్రీంకు రాహుల్ సారీ

|

Apr 22, 2019 | 1:36 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘చౌకీదార్‌ చోర్‌’ అని విమర్శించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల పై రాహుల్ గాంధీ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఆయన తన అఫిడవిట్ ను సమర్పించారు. ‘చౌకీదార్‌ చోర్’ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. ఎన్నికల వేళ.. అనుకోకుండా ఇలా మాట్లాడడం జరిగిందని రాహుల్ అంగీకరించారు. మ‌రోవైపు ఇవాళ రాహుల్.. యూపీలో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం అమేథీతో పాటు బారాబంకి, […]

చౌకీదార్ చోర్ కామెంట్.. సుప్రీంకు రాహుల్ సారీ
Follow us on

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘చౌకీదార్‌ చోర్‌’ అని విమర్శించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల పై రాహుల్ గాంధీ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఆయన తన అఫిడవిట్ ను సమర్పించారు. ‘చౌకీదార్‌ చోర్’ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. ఎన్నికల వేళ.. అనుకోకుండా ఇలా మాట్లాడడం జరిగిందని రాహుల్ అంగీకరించారు. మ‌రోవైపు ఇవాళ రాహుల్.. యూపీలో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం అమేథీతో పాటు బారాబంకి, రాయ్‌బ‌రేలీ, సుల్తాన్‌పుర్ జిల్లాలో ఆయ‌న ప్రచారం చేయ‌నున్నారు.