రఫేల్‌ రాకతో… ఎయిర్ ఫోర్స్ బలోపేతం!

రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్‌ 8న తొలిసారిగా 36 రఫేల్‌ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి స్వీకరించేందుకు త్వరలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌కు బయలుదేరనున్నారు. ఈ మేరకు భారత రక్షణశాఖ అధికారులు గురువారం వివరాలు వెల్లడించారు. ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్‌తో ఒప్పందంలో భాగంగా తొలి 36 విమానాలను భారత్‌ అక్టోబర్‌ 8న స్వీకరించనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం.. […]

రఫేల్‌ రాకతో... ఎయిర్ ఫోర్స్ బలోపేతం!
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 1:31 AM

రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్‌ 8న తొలిసారిగా 36 రఫేల్‌ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి స్వీకరించేందుకు త్వరలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌కు బయలుదేరనున్నారు. ఈ మేరకు భారత రక్షణశాఖ అధికారులు గురువారం వివరాలు వెల్లడించారు. ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్‌తో ఒప్పందంలో భాగంగా తొలి 36 విమానాలను భారత్‌ అక్టోబర్‌ 8న స్వీకరించనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రోజు విజయదశమి పండగ, అదేవిధంగా భారత వైమానిక దళ దినోత్సవం కూడా ఉండటంతో అక్టోబర్‌ 8ని ఎంపిక చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌లో విమానాలను స్వీకరించిన అనంతరం రాజ్‌నాథ్‌ ఒక శిక్షణ విమానంలో ప్రయాణించి పరిశీలించనున్నట్లు తెలిపారు. ఇటీవల రాజ్‌నాథ్‌ సింగ్‌ బెంగళూరులో తేజస్‌లో లైట్‌ కంబాట్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన విషయం తెలిసిందే. భారత్‌ ఎల్‌సీఏ విమానాల ఎగుమతులకు సిద్ధమైన నేపథ్యంలో అందులో ప్రయాణించిన ఆయన అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు.

మళ్లీ వచ్చే ఏడాది ప్రారంభంలో మరో 36 విమానాలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గతంలో రక్షణశాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఏది ఏమైనా వీటి రాకతో భారత రక్షణ రంగం మరింత పటిష్ఠం కానుంది. మొత్తం 58 వేల కోట్లతో 36 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ యుద్ధ విమానం ద్వారా అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో పాటు క్షిపణిలను కూడా ప్రయోగించేందుకు వీలుంటుంది. రాఫెల్ యుద్ధ విమానాలను సమకూర్చుకోవడం వల్ల భారత వైమానికి దళ శక్తి సామర్థ్యాలు గణనీయంగా ఇనుమడిస్తాయని ఐఏఎఫ్ చీఫ్ రాకేష్ కుమార్ అన్నారు

Latest Articles
ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్.. బయట పడ్డ నిజం.. నిస్సహాయ స్థితిలో కావ్య!
ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్.. బయట పడ్డ నిజం.. నిస్సహాయ స్థితిలో కావ్య!
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో జాగ్రత్తలు మస్ట్..!
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో జాగ్రత్తలు మస్ట్..!
'ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన కెప్టెన్ అతను..': యువరాజ్ సింగ్
'ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయిన కెప్టెన్ అతను..': యువరాజ్ సింగ్
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో