ప్రొటోకాల్ ఓఎస్డీగా పివి సింధు..

స్టార్ షట్లర్ పివి సింధుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 2017లో సింధు.. డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా, కొద్దిరోజుల క్రితం ఆమె శిక్షణా కాలం ముగియడంతో.. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌కు ప్రొటోకాల్ ఓఎస్డీగా సింధును నియమిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్డిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. దానికి అవసరమైన ప్రతిపాదనలు […]

ప్రొటోకాల్ ఓఎస్డీగా పివి సింధు..

Updated on: Dec 08, 2019 | 9:57 AM

స్టార్ షట్లర్ పివి సింధుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 2017లో సింధు.. డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా, కొద్దిరోజుల క్రితం ఆమె శిక్షణా కాలం ముగియడంతో.. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌కు ప్రొటోకాల్ ఓఎస్డీగా సింధును నియమిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్డిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. దానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రోటోకాల్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, పివి సింధుకు 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగష్టు 30 వరకు ఆన్ డ్యూటీ లీవ్ మంజూరు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us