టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా రాజీనామా!

టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పంపించారు. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గత ప్రభుత్వం హయాంలో నియమించిన అన్ని దేవాలయాల పాలక మండలిలను రద్దు చేయాలని యోచన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనను పదవి నుంచి తొలిగించే వరకు రాజీనామా చేయనని పట్టుపట్టిన పుట్టా సుధాకర్ యాదవ్.. ఎట్టికేలకు రాజీనామా […]

టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా రాజీనామా!

Updated on: Jun 19, 2019 | 6:48 PM

టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పంపించారు. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గత ప్రభుత్వం హయాంలో నియమించిన అన్ని దేవాలయాల పాలక మండలిలను రద్దు చేయాలని యోచన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనను పదవి నుంచి తొలిగించే వరకు రాజీనామా చేయనని పట్టుపట్టిన పుట్టా సుధాకర్ యాదవ్.. ఎట్టికేలకు రాజీనామా చేశారు. మరోవైపు టీటీడీ చైర్మన్ గా వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us