ప్రధాని మోదీకి ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన విరాట్ కోహ్లీ

|

Sep 24, 2020 | 7:28 PM

ప్రధాని మోదీ ఫిట్‌నెస్‌పై తనకున్న ఇంట్రెస్ట్‌ను మరోసారి చాటుకున్నారు. ఫిట్‌ఇండియా 2020 మూవ్‌మెంట్‌ ఫస్ట్‌ యానివర్సరీని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలువురు క్రీడాప్రముఖులు, క్రీడాకారులతో ప్రధాని ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ కోసం ఉద్దేశించిన యోయో టెస్టు..

ప్రధాని మోదీకి ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన విరాట్ కోహ్లీ
Follow us on

ప్రధాని మోదీ ఫిట్‌నెస్‌పై తనకున్న ఇంట్రెస్ట్‌ను మరోసారి చాటుకున్నారు. ఫిట్‌ఇండియా 2020 మూవ్‌మెంట్‌ ఫస్ట్‌ యానివర్సరీని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలువురు క్రీడాప్రముఖులు, క్రీడాకారులతో ప్రధాని ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ కోసం ఉద్దేశించిన యోయో టెస్టు గురించి టీమిండియా కెప్టెన్‌ కోహ్లీని అడిగి తెలుసుకున్నారు ప్రధాని. యోయో టెస్టు ప్రాధాన్యతపై అమితాసక్తి కనబర్చారు.

కోహ్లాతో మాట్లాడిన ప్రధాని క్రికెటర్లకు నిర్వహించే యోయో టెస్టు గురించి తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జట్టులో ఆడాలంటే కెప్టెన్‌ కూడా యోయో టెస్టు పాసవ్వాల్సిందేనా అంటూ కోహ్లీని అడిగారు మోదీ. ఫిట్‌గా ఉండాలంటే ఆటలు బాగా ఆడాలని.. అది ఒకరు చెబితే రాదని.. మననుంచి రావాలని చెప్పాడు విరాట్ కోహ్లీ. ముందుగా ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని విరాట్ కోహ్లీ ప్రధానికి చెప్పారు. ఫిట్‌నెస్‌లో డైట్ అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నాడు.

ఇతర దేశాల ఆటగాళ్లతో పోల్చితే ఇండియన్‌ ప్లేయర్స్‌ ఫిట్‌నెస్‌ చాలా తక్కువ అని చెప్పాడు కోహ్లీ. యోయో టెస్టు గురించి మోదీకి సమగ్రంగా వివరించారు. ఆటల్లో రాణించాలంటే ఫిట్‌నెస్‌ అత్యంత ముఖ్యమని కోహ్లీ పేర్కొన్నాడు. వెయిట్ లాస్ కోసం చాలామంది ఆహారానికి దూరమవుతున్నారని.. తద్వారా అనారోగ్యసమస్యలను కొని తెచ్చుకుంటారని చెప్పాడు. తన జట్టు మొత్తం ఇప్పుడు ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారించిందని విరాట్ చెప్పాడు.

దేశవ్యాప్తంగా ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులు, క్రీడాకారులతో మాట్లాడారు ప్రధాని మోదీ. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ముచ్చటించారు. కోహ్లీతో పాటు నటుడు, మోడల్ మిలింద్ సోమన్‌తో కూడా మాట్లాడారు. అదే సమయంలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్‌తో ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితానికి కావాల్సిన డైట్ గురించి అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ.