లండన్ కోర్టుకు నీరవ్ మోదీ.. నేడు కీలక విచారణ..

| Edited By: Pardhasaradhi Peri

May 11, 2020 | 5:08 PM

ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. పంజాబ్ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)

లండన్ కోర్టుకు నీరవ్ మోదీ.. నేడు కీలక విచారణ..
Follow us on

PNB fraud case: ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. పంజాబ్ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం సౌత్‌వెస్ట్ లండన్‌లోని వర్డ్స్‌వర్త్ జైల్లో ఉన్న ఆయనను అధికారులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కాగా.. కోవిద్-19 వాప్తి దృష్ట్యా జైళ్లు, కోర్టులు సామాజిక దూరం నియమాన్ని పాటిస్తున్న నేపథ్యంలో.. వీడియో లింక్ ద్వారా ఆయనను విచారించే విషయాన్ని కూడా డిస్ట్రిక్ జడ్జి శామ్యూల్ గూజీ పరిశీలిస్తున్నారు. ‘‘కొన్ని జైళ్లు నిందితులను వ్యక్తిగతంగా ప్రవేశపెడుతున్నందున ఈ నెల 11న నీరవ్ మోదీని కోర్టు ముందుకు తీసుకురావాలని ఆదేశిస్తాం. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో లైవ్ వీడియో లింక్ ద్వారా విచారిస్తాం..’’ అని న్యాయమూర్తి గూజీ పేర్కొన్నారు.

మరోవైపు.. నీరవ్ మోదీని అప్పగించాలంటూ గతేడాది భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నుంచి ఐదు రోజుల పాటు లండన్ కోర్టు విచారణ జరపనుంది. నీరవ్ మోదీ సహా ఆయన బంధువులు పీఎన్‌బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.