నేపాల్.. రాజీనామాకు ప్రధాని ఓలి నో.. చీలిక దిశలో పార్టీ ?

నేపాల్ సంక్షోభం మరో మలుపు తిరిగింది. తన పదవికి, పార్టీ పోస్టుకు కూడా రాజీనామా చేసేందుకు ప్రధాని కెపి. శర్మ ఓలి నిరాకరించారు. నేపాల్ కమ్యూనిస్ట్  పార్టీ స్టాండింగ్ కమిటీ బుధవారం సమావేశం కావలసి ఉన్నప్పటికీ...

నేపాల్.. రాజీనామాకు ప్రధాని ఓలి నో.. చీలిక దిశలో పార్టీ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2020 | 3:53 PM

నేపాల్ సంక్షోభం మరో మలుపు తిరిగింది. తన పదవికి, పార్టీ పోస్టుకు కూడా రాజీనామా చేసేందుకు ప్రధాని కెపి. శర్మ ఓలి నిరాకరించారు. నేపాల్ కమ్యూనిస్ట్  పార్టీ స్టాండింగ్ కమిటీ బుధవారం సమావేశం కావలసి ఉన్నప్పటికీ.. చివరి క్షణంలో వాయిదా పడింది. ఈ సమావేశంలో ఓలి, ఆయన ప్రత్యర్థి వర్గం నేత పుష్పకుమార్ దహాల్ తమ విభేదాలను పక్కన బెట్టి, సయోధ్య కుదుర్చుంటారని, సంక్షోభానికి తెర దించుతారనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఓలి రాజీనామా చేయాల్సిందేనని, పదవిలో ఆయన కొనసాగడం పార్టీకి హానికరమని దహాల్ అంటున్నారు. వీరిద్దరూ నిన్న సమావేశమైనప్పటికీ ఫలితం లేకపోయింది. స్టాండింగ్ కమిటీ లోని 44 మంది సభ్యుల్లో సుమారు 30 మంది ఓలి రాజీనామాకు పట్టుబడుతున్నారు.

అటు-తన రాజీనామాకు అందరూ పట్టుబట్టిన పక్షంలో.. పాలక  పార్టీని రెండుగా చీలుస్తానని శర్మ ఓలి హెచ్ఛరించారు. ఈయనకు మద్దతు నిస్తున్న చైనా.. నేపాల్ లోని పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.  చైనా రాయబారి హౌ యాంకీ.. పాలక పార్టీ నేతలతోనూ, ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీతోను సమావేశమై.. పార్టీ చీలకుండా చూడాలని అభ్యర్థించారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ విభేదాలను పక్కన పెట్టి సమైక్యంగా ఉండాలని చైనా కోరుతోంది.