కరోనా పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటాం: మోదీ

ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాపై పోరాటంలో భారత్ ప్రపంచ దేశాలకు అండగా నిలిచిందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కరోనా వైరస్ నియంత్రణకు 150 దేశాలకు మందులు, వైద్య సామాగ్రిని అందించిందని మోదీ చెప్పారు.

కరోనా పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటాం: మోదీ
Follow us

|

Updated on: Jul 17, 2020 | 10:53 PM

ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాపై పోరాటంలో భారత్ ప్రపంచ దేశాలకు అండగా నిలిచిందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కరోనా వైరస్ నియంత్రణకు 150 దేశాలకు మందులు, వైద్య సామాగ్రిని అందించిందని మోదీ చెప్పారు. కరోనాపై పోరును భారత్ ప్రజా ఉద్యమంగా మార్చిందన్నారు. స్వదేశీ వైద్య మూలాల కారణంగానే భారత్ లో రికవరీ రేటు ఎక్కువగా ఉంటుందని మోదీ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు.

ఐక్యరాజ్యసమితితో పాటు ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలికి భారత్ ఎప్పుడూ అండగా నిలిచిందని మోదీ చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలికి 1946లో రామస్వామి మొదలియార్ అధ్యక్షత వహించారని మోదీ గుర్తు చేశారు. 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లుండాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. అందరితో కలిసి అందరి అభివృద్ధి అనే నినాదంతో పనిచేస్తున్నామన్నారు. మిగతా దేశాలు కూడా భారత్‌లాగే సుస్థిర అభివృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం దోహదపడుతోందని మోదీ చెప్పారు. దేశంలో40 కోట్ల మంది గ్రామీణ భారత మహిళలతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి వారిలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు.