పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రైవేటు సంస్థ‌ల‌ చేతికి !

దేశ పోలీసు వ్యవస్థలో కీలక సంస్కరణ వైపు అడుగులు ప‌డుతున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్టుల వెరిఫికేషన్, రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలను ప్రైవేటు సంస్థ‌ల‌కు అప్పగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాలోచ‌న‌లు చేస్తోంది.

పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రైవేటు సంస్థ‌ల‌ చేతికి !
Follow us

|

Updated on: Aug 24, 2020 | 7:23 AM

దేశ పోలీసు వ్యవస్థలో కీలక సంస్కరణ వైపు అడుగులు ప‌డుతున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్టుల వెరిఫికేషన్, రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలను ప్రైవేటు సంస్థ‌ల‌కు అప్పగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాలోచ‌న‌లు చేస్తోంది. తద్వారా పోలీసులు వారి ప్రాథమిక విధి నిర్వ‌హ‌ణ‌పై మరింత బాగా ఫోక‌స్ పెడతారని.. లా అండ్ ఆర్డ‌ర్ పరిరక్షణ మెరుగ్గా సాగుతుందని భావిస్తోంది. దాదాపు 25 పోలీసింగేతర విధుల నుంచి పోలీసులను విముక్తుల‌ను చేసి.. వాటిని ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా చేయించుకోవాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ అంశంపై అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీల అభిప్రాయాలను కేంద్ర‌ హోం శాఖ తాజాగా కోరింది.

‘పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ’ చేపడుతున్న విప్ల‌వాత్మ‌క మార్పుల్లో భాగంగా కేంద్రం తాజా ప్రతిపాదనవైపు అడుగులు వేసింది. సమన్ల అందజేత, పోస్టల్‌ మెటీరియళ్ల డెలివరీ, పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌, సీసీటీవీ కంట్రోల్‌ రూం మోనెట‌రింగ్, డ్రైవింగ్‌, వంట, దుస్తులు ఉతకడం, స్కూల్స్‌-కాలేజీల‌కు భద్రత కల్పించడం వంటివి కేంద్రం గుర్తించిన 25 పోలీసింగేతర విధుల్లో ఉన్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. వీటిల్లో పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌, రికార్డుల నిర్వహణ వంటి పనులను ప్రైవేటుకు అప్పగించే ఆలోచ‌న‌ సరికాదని మ‌రికొందరు నిపుణులు సూచిస్తున్నారు.

Also Read :

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలు వాయిదా