Breaking : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలు వాయిదా

స్టేట్ గ‌వర్న‌మెంట్ ఉద్యోగులకు ఈనెల 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు జరగాల్సిన శాఖాపరమైన ప‌రీక్ష‌ల‌ను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది.

Breaking : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలు వాయిదా
Follow us

|

Updated on: Aug 23, 2020 | 2:31 PM

స్టేట్ గ‌వర్న‌మెంట్ ఉద్యోగులకు ఈనెల 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు జరగాల్సిన శాఖాపరమైన ప‌రీక్ష‌ల‌ను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ వ్యాప్తి ఉన్న‌ప్ప‌టికీ నిబంధ‌న‌లు అనుగుణంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సమాయ‌త్త‌మైంది. అయితే ఇటీవ‌లి కాలంలో కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోవ‌డం, వ్యాప్తి వేగం కూడా పెర‌గ‌డంతో నిర్ణ‌యం మార్చుకుంది.

పరీక్షలను పరిస్థితులు కుదుట‌ప‌డ్డ అనంత‌రం  నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ ఎగ్జామ్స్‌కు 1.75 లక్షల మంది అప్లై చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు వెల్ల‌డించారు. ఇందులో లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగులే ఉన్నట్లు వివ‌రించారు.

Also Read:

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

మ‌ర‌ణంలోనూ వీడ‌ని బంధం : భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య మృతి

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు