ఆన్‌లైన్ వ్యభిచారం.. ముగ్గురు యువతులు అరెస్ట్!

| Edited By:

Jan 14, 2020 | 12:33 PM

హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. సైలెంట్‌గా.. వెబ్‌సైట్ ద్వారా ఈ దందాను నడిపించేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నెటిజన్స్‌కి వల వేస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ముగ్గురు యువతుల్ని, ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  చిట్టి, చరణ్ అనే యువకులు.. డబ్బుకు ఆశపడి ‘లోకంటో’ అనే వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు. ఈ సైట్‌లో నెటిజన్‌లను ఆకర్షించేలా పలువురి యువతుల […]

ఆన్‌లైన్ వ్యభిచారం.. ముగ్గురు యువతులు అరెస్ట్!
Follow us on

హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. సైలెంట్‌గా.. వెబ్‌సైట్ ద్వారా ఈ దందాను నడిపించేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నెటిజన్స్‌కి వల వేస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ముగ్గురు యువతుల్ని, ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  చిట్టి, చరణ్ అనే యువకులు.. డబ్బుకు ఆశపడి ‘లోకంటో’ అనే వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు. ఈ సైట్‌లో నెటిజన్‌లను ఆకర్షించేలా పలువురి యువతుల ఫొటోలను పెడుతూ ఉండేవారు. వీటిపై నిఘా పెట్టిన పోలీసులు అదునుచూసి, పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు. వీరందరూ బెంగాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో నిర్వాహకులు చిట్టిని అదుపులోకి తీసుకోగా.. చరణ్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.