Old coins : పాత రూ.5, రూ .10 కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఈజీగా లక్షలు సంపాదించవచ్చు..పూర్తి వివరాలు ఇవే !

మనతో రూపాయి, రెండు రూపాయలు ఉండటం కామన్‌. కానీ అదే పది రూపాయల కాయిన్స్ ‌ ఉన్నాయంటే మాత్రం ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

Old coins : పాత రూ.5, రూ .10 కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఈజీగా లక్షలు సంపాదించవచ్చు..పూర్తి వివరాలు ఇవే !

Updated on: Dec 20, 2020 | 4:47 PM

మనతో రూపాయి, రెండు రూపాయలు ఉండటం కామన్‌. కానీ అదే ఐదు, పది రూపాయల కాయిన్స్ ‌ ఉన్నాయంటే మాత్రం ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే మేము చెప్పబోయే తరహా రూ.5, రూ.10 కాయిన్స్  మీ జేబులో ఉంటే మీరు లక్షాధికారులు అయిన్నట్లే..! అవును మీరు విన్నది నిజం. ఈ మధ్య కాలంలో కొన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్స్ ఇలాంటి పురాతన నాణేలు, నోట్లు వేలం వేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. పురాతన నాణేలను సేకరించడం హాబీ అయినట్లయితే మీరు మిలియనీర్ అయ్యే అవకాశముంది. వైష్ణో దేవి ముద్రను కలిగిన 5 లేదా 10 నాణేలు మీ దగ్గర ఉంటే వాటిని వేలానికి ఉంచే ఛాన్స్  ఉంటుంది. ఈ నాణేలను ప్రభుత్వం 2002 లో జారీ చేసింది. ఇప్పుడు కూడా వీటికి అధిక డిమాండ్ ఉంది. మాతా వైష్ణో దేవి అంటే హిందూ సమాజానికి ఎంతో విశ్వాసం.. భక్తి. ప్రజలు అలాంటి ఒక నాణెం తమతో ఉంటే తమకు బాగా కలిసివస్తుందని, మాత ఆశీస్సులు ఉంటాయని భావిస్తారు. అందుకే కొందరు వీటిని సొంతం చేసుకోవడానికి లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

పది రూపాయల నోటుపై 786 అనే సిరీస్‌ ఉన్నా.. మీరు అదృష్టవంతులే. ముస్లిం సమాజంలో బాగా ప్రాచుర్యం పొందిన 786 సిరీస్ ఉన్న కరెన్సీ నోట్లను శుభంగా భావిస్తారు. అంతేకాకుండా వీటిని సొంతం చేసుకోవడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతుందని చెబుతుంటారు. అందువల్ల ఈ సిరీస్ ఉండే  నోట్లు మీ దగ్గర ఉంటే… ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఉంచడం ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఇప్పటికే చాలా మంది ఇలాంటి వాటిని ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో సేల్ చేసి లక్షలు వెనకేసుకున్నారు.

Aso Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి