రాజధాని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం:ఎన్‌ఆర్‌ఐ జేఏసీ

ఏపీ ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో.. రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఎన్‌ఆర్‌ఐ జేఏసీ నిర్ణయించింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేసింది. అమెరికాలో తెలుగువారుండే ప్రాంతాల నుంచి ప్రధానికి నరేంద్రమోదీకి వినతి పత్రాలు పంపించాలని నిర్ణయించినట్లు ఎన్ఆర్‌ఐ జేఏసీ ప్రకటించింది. అమెరికాలోని రాష్ట్రాల రాయబార కేంద్రాలు, తెలుగువారు ఉన్న 70కి పైగా దేశాల నుంచి ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రాలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి విద్యార్థులు, రైతులపై […]

రాజధాని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం:ఎన్‌ఆర్‌ఐ జేఏసీ
Follow us

| Edited By:

Updated on: Feb 10, 2020 | 5:00 AM

ఏపీ ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో.. రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఎన్‌ఆర్‌ఐ జేఏసీ నిర్ణయించింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేసింది. అమెరికాలో తెలుగువారుండే ప్రాంతాల నుంచి ప్రధానికి నరేంద్రమోదీకి వినతి పత్రాలు పంపించాలని నిర్ణయించినట్లు ఎన్ఆర్‌ఐ జేఏసీ ప్రకటించింది. అమెరికాలోని రాష్ట్రాల రాయబార కేంద్రాలు, తెలుగువారు ఉన్న 70కి పైగా దేశాల నుంచి ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రాలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి విద్యార్థులు, రైతులపై వైకాపా ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎన్‌ఆర్‌ఐ జేఏసీ డిమాండ్ చేసింది. కేసులు ఎత్తివేయకపోతే వినతి పత్రాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.