కరెంట్ బిల్లు కట్టలేక కటకటా ! స్టార్ ప్రొడ్యూసర్ ఆవేదన

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీసే నిర్మాతలు తగ్గిపోతున్నారని.. అసలు చిన్న సినిమాలకు లైఫ్ లేదని చెబుతున్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు. తాను నిర్వహిస్తున్న థియేటర్స్‌కు కనీసం కరెంట్ బిల్ కూడా కట్టలేని స్టేజ్‌లో ఉండటం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాడాయన. వీటన్నిటికీ కారణం అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసులే అంటున్నాడు సురేష్ బాబు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో కొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు […]

కరెంట్ బిల్లు కట్టలేక కటకటా ! స్టార్ ప్రొడ్యూసర్ ఆవేదన
Follow us

|

Updated on: Nov 19, 2019 | 4:26 PM

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీసే నిర్మాతలు తగ్గిపోతున్నారని.. అసలు చిన్న సినిమాలకు లైఫ్ లేదని చెబుతున్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు. తాను నిర్వహిస్తున్న థియేటర్స్‌కు కనీసం కరెంట్ బిల్ కూడా కట్టలేని స్టేజ్‌లో ఉండటం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాడాయన. వీటన్నిటికీ కారణం అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసులే అంటున్నాడు సురేష్ బాబు.

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో కొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు సినిమా విడుద‌లయ్యాక రెండు మూడు నెల‌ల‌కు గానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఆ సినిమాలు టీవీలో ప్రసారం అవ్వడానికి కూడా చాలా నెలలు పట్టేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.. విడుదలైన నెలలోపే ఒరిజినల్ హెచ్ డీ ప్రింట్స్ అందుబాటులోకి వచ్చేయడంతో ప్రేక్షకులు సినిమాహాళ్లకు రావడం మానేసారంటూ ఆయన వాపోయారు.. ఒక రకంగా చూసుకుంటే దీనివ‌ల్ల నిర్మాత‌ల‌కు కూడా లాభాలే ఉంటాయి.. థియెట్రిక‌ల్ రైట్స్, శాటిలైట్, ఆడియో రైట్ల‌తో పాటు ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ కూడా కోట్లు కురిపిస్తున్నాయి. కానీ లాంగ్ రన్ లో మాత్రం దీనివల్ల ఇండస్ట్రీకి నష్టాలు వస్తాయని చెప్పారు.. ఇక డిజిట‌ల్ రైట్స్‌పై తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లి ఈ మధ్యే ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌ట్నుంచి విడుద‌లైన ప్ర‌తీ సినిమాను కేవ‌లం మూడు నాలుగు వారాల్లోనే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ల‌లో విడుద‌ల చేస్తామంటే కుద‌ర‌దు.. తప్పకుండా 8 వారాలు ర‌న్ ముగిసిన త‌ర్వాతే సినిమా విడుద‌ల చేయాల్సిందిగా షరతును విధించారు.

Latest Articles
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా