ఐసీసీ కొత్త ఛైర్మన్​గా న్యూజిలాండ్​కు చెందిన గ్రెగ్‌ బార్‌క్లే… ప్రత్యర్థి ఖవాజాపై మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం

|

Nov 25, 2020 | 12:59 PM

ఐసీసీ కొత్త ఛైర్మన్​గా న్యూజిలాండ్​కు చెందిన గ్రెగ్‌ బార్‌క్లే ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ఖవాజాపై మూడింట రెండొంతుల మెజారిటీతో ఈ పదవిని దక్కించుకున్నారు. ఛైర్మన్‌ పదవికి తనతో పాటు పోటీ చేసిన తాత్కాలిక...

ఐసీసీ కొత్త ఛైర్మన్​గా న్యూజిలాండ్​కు చెందిన గ్రెగ్‌ బార్‌క్లే... ప్రత్యర్థి ఖవాజాపై మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం
Follow us on

ICC New Independent Chairman : ఐసీసీ కొత్త ఛైర్మన్​గా న్యూజిలాండ్​కు చెందిన గ్రెగ్‌ బార్‌క్లే ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ఖవాజాపై మూడింట రెండొంతుల మెజారిటీతో ఈ పదవిని దక్కించుకున్నారు. ఛైర్మన్‌ పదవికి తనతో పాటు పోటీ చేసిన తాత్కాలిక ఛైర్మన్ ఇమ్రాన్‌ ఖవాజాపై 11-5 ఓట్ల తేడాతో పైచేయి సాధించి స్వతంత్ర ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. శశాంక్ మనోహర్‌ తర్వాత ఎన్నికైన రెండో స్వతంత్ర ఛైర్మన్‌గా నిలవనున్నారు.

ఈ​ ఎన్నికలోని తొలి రౌండ్​లో బార్క్​లేకు 10 ఓట్లు, ఖవాజాకు ​6 ఓట్లు మాత్రమే దక్కాయి. రెండో రౌండ్​లో దక్షిణాఫ్రికా బోర్డు.. బార్క్​లేకు మద్దతు తెలపడం వల్ల ఐసీసీ నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన బార్క్​లే ఛైర్మన్​గా ఎన్నికయ్యారు.

ఇక 2012 నుంచి న్యూజిలాండ్‌ క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బార్‌క్లే న్యాయవాదిగా పనిచేశారు. అంతేగాక 2015 ప్రపంచకప్‌ డైరెక్టర్‌గా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని కొన్ని బోర్డులకు డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. అయితే.. బార్‌క్లే ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనుండటంతో తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న ఖవాజా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అంతకుముందు జులైలో మనోహర్ పదవీ కాలం ముగియడంతో ఖవాజా తాత్కాలికంగా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.