గుడ్ న్యూస్.. కరోనా కట్టడికి మరో 21 మందులు..!

తాజాగా కరోనాను నిరోధించేందుకు మరో 21 ఔషధాలను కనుగొన్నట్లు అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ బర్న్‌హమ్‌ ప్రిబైస్ మెడికల్ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గుడ్ న్యూస్.. కరోనా కట్టడికి మరో 21 మందులు..!

Updated on: Jul 26, 2020 | 11:58 AM

New Medicines For Coronavirus: ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఎప్పుడు.? ఎలా.? ఈ వైరస్ సోకుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దీనికి విరుగుడు కనిపెట్టేందుకు వివిధ దేశాల శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులకు రెమ్‌డిసివర్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్ లాంటి టాబ్లెట్స్ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు తాజాగా కరోనాను నిరోధించేందుకు మరో 21 ఔషధాలను కనుగొన్నట్లు అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ బర్న్‌హమ్‌ ప్రిబైస్ మెడికల్ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు ఇటీవల 12,000 ఔషధాలపై పరిశోధనలు జరిపి అందులో 21 ఔషధాలకు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే సామర్ధ్యం ఉందని నిర్ధారించారు. ఇక వీటిల్లో నాలుగు ఔషధాలను ఇప్పుడు ఉపయోగిస్తున్న రెమ్‌డిసివర్‌తో కలిసి వాడొచ్చని పేర్కొన్నారు. వీరి అధ్యయనానికి సంబంధించి ఓ వార్తను ‘నేచర్’ పత్రిక ప్రచురించింది.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!

కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలోనే పేదలకు సులభంగా లోన్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us