నేపాల్…ప్రధాని కెపి శర్మ ఓలి భవిష్యత్ రేపు తేలేనా ?

నేపాల్ లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నప్పటికీ.. పాలక నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత పుష్ప కమల్ దహాల్ ఆదివారం ఓలిని..

నేపాల్...ప్రధాని కెపి శర్మ ఓలి భవిష్యత్ రేపు తేలేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2020 | 6:17 PM

నేపాల్ లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నప్పటికీ.. పాలక నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత పుష్ప కమల్ దహాల్ ఆదివారం ఓలిని అయన నివాసంలో కలుసుకున్నారు. వీరి మధ్య రెండో దఫా సమావేశం మళ్ళీ రేపు జరగనుంది. దహాల్ మొదట ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీని కలిసిన అనంతరం ఓలితో సమావేశమయ్యారు. శర్మ రాజకీయ భవితవ్యంపై రేపే నేతలు ఓ నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. ఇండియాకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన నిరంకుశ వైఖరి పార్టీలో లుకలుకలకు కారణమయ్యాయి. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో 45 మంది సభ్యులు గల శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీ ఈ నెల నాలుగున జరగాల్సి ఉండగా… చివరి క్షణంలో వాయిదా పడింది. బహుశా ఈ కమిటీ సోమవారం సమావేశం కావచ్ఛునని భావిస్తున్నారు.

Latest Articles