Coronavirus: చావు గెలిచిన 12వేల మంది

చైనాలో పుట్టిన ‘కరోనా’ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ ప్రమాదకర వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. దీని భారిన పడ్డ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 1,807కి చేరుకుంది. అలాగే 72 వేల 436 కేసులు నమోదయ్యాయని, ఇందులో మరో 11 వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. కరోనా కేంద్ర బిందువైన హుబేయ్ […]

Coronavirus: చావు గెలిచిన 12వేల మంది
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 3:14 PM

చైనాలో పుట్టిన ‘కరోనా’ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ ప్రమాదకర వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. దీని భారిన పడ్డ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 1,807కి చేరుకుంది. అలాగే 72 వేల 436 కేసులు నమోదయ్యాయని, ఇందులో మరో 11 వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

కరోనా కేంద్ర బిందువైన హుబేయ్ ప్రావిన్స్‌లోనే ఈ మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయని.. దీంతో లక్షల మంది ప్రజలను నిర్భందించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ వైరస్ బారిన పడిన 12 వేల మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశమని వారు తెలిపారు.

చైనాలో కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు తాము తీసుకుంటున్న చర్యలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయని, వైరస్‌ వ్యాపించే వేగం తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని చైనా వైద్యాధికారులు తెలిపారు. అయితే, గతంతో పోల్చితే రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఓ నివేదిక వైద్య ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. వ్యాధి కట్టడి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన అంతర్జాతీయ వైద్య నిపుణుల బృందం ఇప్పటికే బీజింగ్‌ చేరుకుంది.