త్వరలో రెడ్ ప్లానెట్ పైకి నాసా రోవర్‌..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నెమ్మదించిన అంతరిక్ష ప్రయోగాలను నాసా మళ్లీ మొదలెట్టింది. వచ్చే నెలలో అంగారకుడిపైకి

  • Tv9 Telugu
  • Publish Date - 5:17 pm, Sun, 21 June 20
త్వరలో రెడ్ ప్లానెట్ పైకి నాసా రోవర్‌..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నెమ్మదించిన అంతరిక్ష ప్రయోగాలను నాసా మళ్లీ మొదలెట్టింది. వచ్చే నెలలో అంగారకుడిపైకి ఓ రోవర్‌ను పంపేందుకు సిద్ధమైంది. అంగారకుడిపై జీవజాల ఉనికి , నమూనాల సేకరణకోసం కారు సైజులో ఉండే రోబోను జూలై 20న ఫ్లోరిడాలోని కేప్ కెనర్వాల్‌ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు నాసా ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా.. 2012 నుండి రెడ్ ప్లానెట్‌ను నాసా అన్వేషిస్తుంది. రోవర్ యొక్క ఆస్ట్రోబయాలజీ మిషన్ అంగారక గ్రహంపై సూక్ష్మజీవుల సంకేతాలను సైతం తెలుసుకోనుంది. మిషన్ బృందాలు రోవర్, రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేయాల్సి ఉండగా, కరోనావైరస్ మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. అయితే, కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి పనులు జరిగేలా చూస్తున్నామని పేర్కొంది. ఆరు చక్రాలున్న ఈ రోవర్‌ ఫిబ్రవరి 18, 2021లో అంగారకుడిపైకి చేరుకుంటుందని నాసా అడ్మినిస్టేటర్‌ జిమ్ బ్రిడెన్‌స్టైన్‌ వెల్లడించారు. రెడ్ ప్లానెట్ యొక్క 28-మైళ్ల వెడల్పు (45 కిలోమీటర్లు) జెజెరో క్రేటర్ లోపల ఇది ల్యాండ్ అవుతుందని వివరించారు.