చంద్రుడిపై నిలబడి ఆస్ట్రోనాట్‌లు సెల్ఫీలు, చిన్న చిన్న వీడియోలు తీసుకునే వీలుంటుందా..? వాటిని వెంటనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగలుగుతామా?. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.! అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ కలను నిజం చేయబోతుందట. ఇందుకోసం చేపడుతున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయంటున్నారు నిపుణులు.
చంద్రుడిపై కనెక్టివిటీనీ పెంచేందుకు ప్రముఖ టెక్ సంస్థ నోకియా, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చంద్రుడిపై 4జీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయట. దీని కోసం నాసా ఏకంగా 14.1 మిలియన్ డాలర్లను కేటాయించిందని సమాచారం. 4జీతో ప్రారంభించి ఆ తరువాత 5జీ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేయాలనేది నాసా ఆలోచన.
సాంకేతిక దిగ్గజం నోకియాకు చెందిన పరిశోధన విభాగం బెల్ ల్యాబ్స్‌ను కీలక భాగస్వామిగా ఎంపిక చేసింది. టిప్పింగ్ పాయింట్ టెక్నాలజీస్ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలో సమాచార మార్పిడిని మరింత వేగవంతమవుతుందని నాసా పేర్కొంది. దీనిపై బెల్ ల్యాబ్స్ కూడా స్పందించింది. తాము కీలక భాగస్వామిగా ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. చంద్రుడిపై మానవాళి సుస్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు ఈ ప్రయత్నాలు దోహద పడతాయని తెలిపింది.
We’re over the moon to announce further details after being named by @NASA as a key partner to advance “Tipping Point” technologies for the Moon.
The pioneering innovations from @BellLabs will deploy the first LTE/4G communications system in space. https://t.co/Y6SmsPzJcQ pic.twitter.com/kJVQURXLMu
— Nokia (@nokia) October 19, 2020