NASA New Project: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా.. ఒకవేళ ఇది విజయవంతమైతే ఆ మార్గం సుగమమం..

|

Jan 12, 2021 | 5:40 AM

NASA SLS Rocket: అంతరిక్ష పరిశోధన రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా...

NASA New Project: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా.. ఒకవేళ ఇది విజయవంతమైతే ఆ మార్గం సుగమమం..
Follow us on

NASA SLS Rocket: అంతరిక్ష పరిశోధన రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే జనవరి 17న అత్యంత శక్తివంతమైన ఎస్‌ఎల్‌ఎస్‌ (స్పేస్‌ లాంచ్‌ సిస్టం) రాకెట్‌ను పరీక్షించనుంది. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే వాణిజ్యేతర మానవ అంతరిక్ష ప్రయాణానికి మార్గం సుగమమం కానుంది. నిజానికి ఈ స్పేస్‌ లాంచ్‌ సిస్టం ప్రయోగం ఇప్పటికే జరగాల్సి ఉండగా.. ఇతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక నాసా ఈ ప్రయోగాన్ని ఆర్టెమిస్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌కు కొనసాగింపుగా చేపట్టనుంది.
ఆర్టెమిస్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌ విషయానికొస్తే.. ఈ మిషన్‌లో భాగంగా 2024లో జాబిల్లిపైకి మొదటిసారి ఒక మహిళను తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా 2030 నాటికీ మానవులను అంగారక గ్రహంపైకి తీసుకెళ్లనున్నారు. దీంట్లో భాగంగానే చివరి ఎనిమిదవ దశ పరీక్షలో భాగంగా రాకెట్‌ను ఈనెల 17న పరీక్షించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒక మహిళను, పురుషుడిని చంద్రునిపైకి తీసుకెళ్లడానికి అవకాశాలు పెరుగుతాయని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Also Read: What’s App Groups: గూగుల్ సెర్చ్‏లో వాట్సప్ గ్రూపులను యాక్సెస్ చేయ్యొచ్చా ? నిపుణులు ఏం అంటున్నారు..