ఆ ఇద్దరికే నేను భయపడతానుః బాలకృష్ణ

సీనియర్ ఎన్టీఆర్ గారి నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ. అటు సినిమాను.. ఇటు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ..

ఆ ఇద్దరికే నేను భయపడతానుః బాలకృష్ణ
Follow us

|

Updated on: Jun 10, 2020 | 12:26 PM

సీనియర్ ఎన్టీఆర్ గారి నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ. అటు సినిమాను.. ఇటు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ.. అన్నగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అద్భుతమైన విజయాలను అందుకున్నారు. బొబ్బిలి సింహం, రౌడీ ఇన్స్‌స్టెక్టర్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చిత్రాలతో బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టి అభిమానులకు నందమూరి నటసింహంగా మారారు. అటు ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. నేడు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే తన పుట్టినరోజు నాడు బాలకృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. నాన్నగారి తర్వాత తాను భయపడేది కేవలం బ్రహ్మణికి మాత్రమేనని ఆయన అన్నారు. బ్రహ్మణి చాలా బ్యాలెన్స్‌డ్‌ అని చెప్పిన బాలకృష్ణ.. ఆమె ఏ విషయాన్ని అయినా చాలా కూల్‌గా చెబుతుందన్నారు. ఆమె వల్లే తనకు సహనం అలవదిందని.. తను ఏం చెప్పినా వింటానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు అన్న వ్యాఖ్యలపై కూడా బాలకృష్ణ వివరణ ఇచ్చారు. ప్రభుత్వాలను ఎప్పుడూ కూడా తాను తప్పుపట్టనని.. ఒకవేళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలిస్తే ఏపీ సీఎంను కలవడానికి వెళ్లి ఉండేవాడని అన్నారు. సీఎం కేసీఆర్ అంటే తనకు అమితమైన గౌరవమని బాలకృష్ణ తెలిపారు.

Also Read: 

జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..

అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

విజయవాడలో కరోనా టెర్రర్.. కంటైన్మెంట్ జోన్లుగా 42 డివిజన్లు..

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

ఫోన్‌కే కరోనా ఫలితం.. ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన.!