ఇటలీలో గులాబీ రంగు మంచు.. రీజన్ ఇదే..

| Edited By:

Jul 06, 2020 | 10:29 PM

వాతావరణ మార్పుల ప్రభావాలను ఆల్గే వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలో ఇటలీలోని ఆల్ప్స్‌ పర్వతాల్లో గులాబీ రంగులోకి మారిన మంచును చూసి అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ

ఇటలీలో గులాబీ రంగు మంచు.. రీజన్ ఇదే..
Follow us on

వాతావరణ మార్పుల ప్రభావాలను ఆల్గే వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలో ఇటలీలోని ఆల్ప్స్‌ పర్వతాల్లో గులాబీ రంగులోకి మారిన మంచును చూసి అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని, ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘వేగంగా మంచు కరగడం వల్ల ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. మంచు ఆల్గేలు వేడిని గ్రహించి హిమనదిని త్వరగా కరిగిస్తాయి. వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పడానికి గులాబి మంచు ఉదాహరణ’ అని ఇటలీ నేషనల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ శాస్త్రవేత్త బియాజియో డి మౌరో పేర్కొన్నారు.

Also Read: కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..