యువకుడి కత్తిపోట్లు.. పరిస్థితి విషమం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలతో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడి పరిస్థితి విషమం.

యువకుడి కత్తిపోట్లు.. పరిస్థితి విషమం

Updated on: Jun 11, 2020 | 8:24 PM

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలతో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబసభ్యలు తెలిపారు.
కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతాల పహాడ్ గ్రామ పంచాయతీలోని బాపూజీనగర్‌కు చెందిన రాపాని యాదగిరి, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. యాదగిరిపై కక్ష పెంచుకున్న యువకులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొండమల్లేపల్లి సమీపంలోని సాగర్‌ రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌వద్ద ఒంటరిగా ఉన్న యాదగిరిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకోవడంతో దుండగలు అక్కడినుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాదగిరిని చికిత్స నిమిత్తం పోలీసులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాదగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us