రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ !

రైతులకు  కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్ సభలో  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటన చేశారు. దీంతో మద్దతు ధర అసత్యాలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లైంది.  గోధుమ పంట కనీస మద్దతు ధరను రూ.50 పెంచడం వల్ల  క్వింటాల్​ రూ.1,975కు చేరనుంది. కేంద్ర మద్దతు ధర పెంచిన మరికొన్ని పంటలు […]

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ !
Follow us

|

Updated on: Sep 21, 2020 | 7:02 PM

రైతులకు  కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్ సభలో  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటన చేశారు. దీంతో మద్దతు ధర అసత్యాలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లైంది.  గోధుమ పంట కనీస మద్దతు ధరను రూ.50 పెంచడం వల్ల  క్వింటాల్​ రూ.1,975కు చేరనుంది.

కేంద్ర మద్దతు ధర పెంచిన మరికొన్ని పంటలు

శనగలు క్వింటాకు రూ.225  పెంపు

మసూర్ దాల్ క్వింటాకు రూ.300 పెంపు

ఆవాలు క్వింటాకు రూ.225 పెంపు

బార్లీ క్వింటాకు రూ.75 పెంపు

కుసుమలు క్వింటాకు రూ.112  పెంపు

వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినా.. కనీస మద్దతు ధర కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాల్లో విపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని తోమర్​ కోరారు.

Also Read : ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !