అలా అనిపిస్తే.. వెంటనే చేయండి: కంగనా స్టేట్మెంట్..!

| Edited By: Team Veegam

Feb 25, 2021 | 6:16 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ.. వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేసింది. సెక్స్ గురించి మాట్లాలంటే చాలామంది ఆలోచిస్తారు. అలాంటిది ఆమె మాత్రం ఏకంగా బహిరంగానే సెక్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పార్టిసిపేట్ చేసిన కంగనా.. పిల్లలు సెక్స్ కోరుకుంటే.. వెంటనే వారి కోరిక తీర్చేలా చేయండి అంటూ మాట్లాడింది. […]

అలా అనిపిస్తే.. వెంటనే చేయండి: కంగనా స్టేట్మెంట్..!
Follow us on

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ.. వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేసింది. సెక్స్ గురించి మాట్లాలంటే చాలామంది ఆలోచిస్తారు. అలాంటిది ఆమె మాత్రం ఏకంగా బహిరంగానే సెక్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పార్టిసిపేట్ చేసిన కంగనా.. పిల్లలు సెక్స్ కోరుకుంటే.. వెంటనే వారి కోరిక తీర్చేలా చేయండి అంటూ మాట్లాడింది. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంది. అంతేకాదు.. తన మొదటి ప్రేమ, ముద్దు ముచ్చట గురించి కూడా చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సెక్స్ కోరుకుంటే ఆ పనిచేసేయండి అని చెప్పింది. మన ఆచారాలు, సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదని తెలుసు అంటూనే సెక్స్ పై తన అభిప్రాయాలను బహిరంగంగా తెలిపింది.

అప్పట్లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్.. తనను మోసం చేశాడని పెద్ద రచ్చ చేసింది. ఆ తరువాత మణికర్ణిక సినిమా విషయంలో కూడా దర్శకుడు క్రిష్‌తో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత తానే మణికర్ణిక మూవీని టేకప్ చేసి మంచి సక్సస్ అందుకుంది. ఇక తాజాగా ఈమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న ‘తలైవి సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తోంది.