లెటర్ రిలీజ్ చేసిన చిరు ఆచార్య మూవీ టీం

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కథ.. దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ 'ఆచార్య' తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమా కథ తనదంటే తనదంటూ..

లెటర్ రిలీజ్ చేసిన చిరు ఆచార్య మూవీ టీం

Updated on: Aug 27, 2020 | 4:56 PM

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కథ.. దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘ఆచార్య’ తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమా కథ తనదంటే తనదంటూ కొందరు మీడియాకెక్కారు. చిరు బర్త్డే అయిన ఆగష్టు 22న రిలీజ్ అయిన ‘ఆచార్య’ సినిమా మోషన్ పోస్టర్ చూసి కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఈ సినిమా కథ తనదేనంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజేశ్ మండూరి అనే రచయిత కూడా కథ తనదే అంటూ మీడియా కెక్కాడు. దీంతో నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ ఒక లెటర్ రిలీజ్ చేసింది. తమ సినిమా కథ ఎవరినుంచీ కాపీ కొట్టింది కాదని క్లారిటీ ఇచ్చింది. తమ కథను కాపీ కొట్టారంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవన్నీ ఒట్టిమాటలని కొట్టేసింది. ఇది ముమ్మాటికీ తమ దర్శకులు కొరటాల శివ కథ మాత్రమేనని స్పష్టం చేసింది.

 

Follow Us