చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ చీఫ్

|

Aug 06, 2020 | 7:03 PM

బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మెగా స్టార్ చిరంజీవి అభినందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎంపికైన సోము వీర్రాజును చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఆయనను పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిద్ధరి మధ్య కాసేపు సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వారిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు […]

చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ చీఫ్
Follow us on

బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మెగా స్టార్ చిరంజీవి అభినందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎంపికైన సోము వీర్రాజును చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఆయనను పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిద్ధరి మధ్య కాసేపు సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వారిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు తెలియరాలేదు.