మంగ్లీ వర్సెస్ దండుపాళ్యం.. చివరికి నెగ్గిందెవరు ?

మంగ్లీ అనే పేరుతో యాంకర్‌గా మొదలై సింగర్‌గా.. ప్రస్తుతం యాక్టర్‌గాను మారిన సత్యవతి రాథోడ్ సినిమా తెలంగాణలోని తాండూరు‌లో హల్‌చల్ సృష్టించింది. మంగ్లీ నటించిన మూవీ గోర్ జీవన్ ఇవాళ విడుదల కావాల్సి వుండగా.. తాండూరులోని ఓ థియేటర్‌కు గిరిజనులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. తీరా వారంతా థియేటర్‌కు చేరుకునే లోగా గోర్ జీవన్ సినిమా పోస్టర్ కాస్త మారిపోయి.. దండుపాళ్యం మూవీ పోస్టర్లు వెలిశాయి. అవాక్కయిన గిరిజనులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. దాంతో […]

మంగ్లీ వర్సెస్ దండుపాళ్యం.. చివరికి నెగ్గిందెవరు ?
Follow us

|

Updated on: Nov 01, 2019 | 2:07 PM

మంగ్లీ అనే పేరుతో యాంకర్‌గా మొదలై సింగర్‌గా.. ప్రస్తుతం యాక్టర్‌గాను మారిన సత్యవతి రాథోడ్ సినిమా తెలంగాణలోని తాండూరు‌లో హల్‌చల్ సృష్టించింది. మంగ్లీ నటించిన మూవీ గోర్ జీవన్ ఇవాళ విడుదల కావాల్సి వుండగా.. తాండూరులోని ఓ థియేటర్‌కు గిరిజనులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. తీరా వారంతా థియేటర్‌కు చేరుకునే లోగా గోర్ జీవన్ సినిమా పోస్టర్ కాస్త మారిపోయి.. దండుపాళ్యం మూవీ పోస్టర్లు వెలిశాయి. అవాక్కయిన గిరిజనులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. దాంతో థియేటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
గిరిజనుల సినిమాపై చిన్న చూపా..?
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉద్రిక్తతలకు మంగ్లీ కథానాయికగా నిర్మితమైన ” గోర్ జీవన్ ” సినిమా కారణమైంది. ఈ సినిమాను తాండూరులోని లక్ష్మి మహల్ థియేటర్లో విడుదలవుతున్నట్టు పత్రికలలో ప్రకటించారు. దాంతో ఈ సినిమాను చూసేందుకు గిరిజనులు పెద్ద సంఖ్యలో తాండూరులోని సినిమా థియేటర్‌కు తరలి వచ్చారు. అయితే వారొచ్చేసరికి “గోర్ జీవన్” సినిమాకు బదులు థియేటర్లలో దండుపాళ్యం సినిమాను ప్రదర్శిస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి.
దాంతో గిరిజనులు తీవ్ర నిరాశ మిగిలింది.  వారంతా ఒక్కసారిగా థియేటర్ ముందు గోర్ జీవన్ సినిమాను ప్రదర్శించాలని ముందు ఆందోళనకు దిగారు. గిరిజనులైన తమను చిన్నచూపు చూస్తూ చిత్రాన్ని అడ్డుకుని వేరే చిత్రాన్ని ప్రదర్శిస్తారా అని మండిపడ్డారు. కొందరు థియేటర్ పై రాళ్ళు రావడంతోపాటు అక్కడ వెలిసిన దండుపాళ్యం పోస్టర్లను చించి వేశారు.
పోలీసులు రంగప్రవేశం చేసి.. కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో థియేటర్ యాజమాన్యం దిగిరాకతప్పలేదు. గోర్ జీవన్ మూవీ పోస్టర్లను అతికించడంతోపాటు సినిమాను ప్రదర్శించడంతో గిరిజనులు చల్లబడ్డారు.