
మంచులక్ష్మి కూతురు వైద్య నిర్వాణ చిన్నవయసులోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే చెస్ లో రాణిస్తున్న ఈ చిన్నారి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డులో `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. డిసెంబర్ 19న నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన అన్ని స్థాయి పోటీల్లోనూ విజేతగా నిలిచి ఈ రికార్డ్ సొంతం చేసుకుంది.
చిన్నారి వైద్య ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా. చోకలింగం బాలాజి. నాలుగైదు సంవత్సరాల పిల్లలు చెస్ ఆడడం మనం చూసుంటాం కాని ఆరెళ్ల వయసులో చెస్ గేమ్‌లో ట్రైనింగ్ ఇవ్వడం గొప్ప విషయం అని అన్నారు. వైద్య నిర్వాణకి చెస్ గేమ్ నేర్పిస్తే తప్పకుండా రాణించగలదని గతేడాదే మంచు లక్ష్మిగారికి చెప్పడం జరిగిందని అయితే తన వయసు చాలా చిన్నది ఇప్పుడే వద్దు అని అన్నారని గుర్తు చేశారు.
And this happened today! I was more nervous than Nirvana but I think she’s a natural. My daughter now holds The Noble Book of World Records as the Youngest Chess Trainer. So proud of you! First of many for my brilliant girl. Keep your love coming for my little munchkin. #ProudMom pic.twitter.com/aCoeLJ7t48
— Lakshmi Manchu (@LakshmiManchu) December 19, 2020
ఈ ఏడాది లక్ష్మిగారే ఫోన్ చేసి తనకి ట్రైనింగ్ ఇవ్వమని అడిగారు. ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాక నాలుగైదు క్లాసుల్లోనే ఎంతో చురుకుగా గేమ్‌ని పూర్తిగా నేర్చుకుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌కి చెస్‌గేమ్ నేర్పించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే తన ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ రికార్డ్ ఎందుకు నమోదు చేయకూడదు అనిపించి వారి ప్రతినిధులతో మాట్లాడి ఈ రికార్డ్‌కోసం నమోదు చేయడం జరిగింది.
ఇక తన కూతురు వైద్య నిర్వాణ చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను నమ్ముతాను అని అన్నారు. అందుకే వైద్య కి చిన్న వయసులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందన్నారు. కాని రెండు వారాల్లోనే తన కోచ్ కార్తిక్ నా దగ్గరకు వచ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది ఈ రికార్డ్‌కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. ఇప్పుడే వద్దు సార్ ఇంకా కొన్ని రోజులు చూడండి తర్వాత చూద్దాం అన్నాను. తను రెడీగా ఉన్నప్పుడు మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని ఓకే చెప్పడం జరిగిందన్నారు.