మా అందరికీ నెగెటివ్, డ్యాన్స్ తో చిందులేసిన మధ్యప్రదేశ్ ఫ్యామిలీ

ఈ కరోనా కాలంలో నెగెటివ్ అని తేలితే ఇక సంతోషానికి హద్దేముంటుంది ? అలాగే మధ్యప్రదేశ్ లోని ఓ కుటుంబం తమకు నెగెటివ్ అని తేలగానే ఆనందం పట్టలేక డ్యాన్స్ చేసింది..

మా అందరికీ నెగెటివ్, డ్యాన్స్ తో చిందులేసిన మధ్యప్రదేశ్ ఫ్యామిలీ

Edited By:

Updated on: Aug 18, 2020 | 7:00 PM

ఈ కరోనా కాలంలో నెగెటివ్ అని తేలితే ఇక సంతోషానికి హద్దేముంటుంది ? అలాగే మధ్యప్రదేశ్ లోని ఓ కుటుంబం తమకు నెగెటివ్ అని తేలగానే ఆనందం పట్టలేక డ్యాన్స్ చేసింది. అది.కత్ని ప్రాంత  హాస్పిటల్ లోని కోవిడ్ ఐసోలేషన్ వార్డు.. ఈ వార్డులో కరోనా వైరస్ నుంచి కోలుకుని నెగెటివ్ తో బయటపడిన కుటుంబ సభ్యుల్లో 8 మంది ఓ బాలీవుడ్ మూవీ సాంగ్ కి డ్యాన్స్ చేశారు. వారి పెర్ఫార్మన్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అయింది.

సుశాంత్ సింగ్ నటించిన ‘చిచోర్’ చిత్రంలోని ‘చింతా కర్ కే క్యా పాయేగా, మర్ నే సే పహ్ లే మర్ జాయెగా’ (చింతిస్తే ఏమొస్తుంది, మరణించేముందే మరణించినట్టే) అనే పాటకు ఆ కుటుంబం చిన్నారులతో సహా డ్యాన్స్ చేసింది. ఈ  కుటుంబంలోని 19 మంది సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ నెల 8 న వారిని జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారని, చికిత్స అనంతరం అందరికీ నెగెటివ్ అని రావడంతో ఈ నెల 15 న డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్లు తెలిపారు. డిశ్చార్జ్ కి ముందు వారు ఐసోలేషన్ వార్డులోనే ఇలా ఆనందంలో తేలియాడారు.

మధ్యప్రదేశ్ లో  ఇప్పటివరకు 46,300 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 35 వేలమంది రోగులు కోలుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన మంత్రివర్గంలోని  నలుగురు మంత్రులు కూడా కోవిడ్ బారిన పడినా.. చౌహన్ సహా మరో ముగ్గురు పూర్తిగా కోలుకున్నారు.