ఆర్మీ శిక్షణలో ధోని.. కశ్మీర్‌లో డ్యూటీ

రెండు నెలల పాటు క్రికెట్‌కు విరామం ప్రకటించి లెఫ్టినెంట్ హోదాలో పారాచూట్ రెజిమెంట్‌లో శిక్షణ తీసుకునేందుకు ధోని సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన 106టెర్రిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరాడు. ఈ నెల 31 నుంచి ఆగష్టు 15వరకు ఆయన ఆ బెటాలియన్‌తోనే కలిసి పనిచేయనున్నారు. కశ్మీర్‌లో విక్టర్‌ ఫోర్స్ పేరిట నిర్వహించే యూనిట్‌లో ఈ బెటాలియన్ పని చేయనుండగా.. వారితో పాటే ధోని కూడా ఉండనున్నారు. ఇక ఈ శిక్షణలో భాగంగా పెట్రోలింగ్, […]

ఆర్మీ శిక్షణలో ధోని.. కశ్మీర్‌లో డ్యూటీ

Edited By:

Updated on: Jul 25, 2019 | 4:22 PM

రెండు నెలల పాటు క్రికెట్‌కు విరామం ప్రకటించి లెఫ్టినెంట్ హోదాలో పారాచూట్ రెజిమెంట్‌లో శిక్షణ తీసుకునేందుకు ధోని సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన 106టెర్రిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరాడు. ఈ నెల 31 నుంచి ఆగష్టు 15వరకు ఆయన ఆ బెటాలియన్‌తోనే కలిసి పనిచేయనున్నారు. కశ్మీర్‌లో విక్టర్‌ ఫోర్స్ పేరిట నిర్వహించే యూనిట్‌లో ఈ బెటాలియన్ పని చేయనుండగా.. వారితో పాటే ధోని కూడా ఉండనున్నారు. ఇక ఈ శిక్షణలో భాగంగా పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ పనులను కూడా ధోని నిర్వహించనున్నారు.