40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే ‘శ్రీ అత్తి వరదరాజ స్వామి’!

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సుమారు 1000కి పైగా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ వరదరాజ స్వామి దేవాలయం 108 దివ్య తిరుపతులలో ఒకటైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉంటాయి. బ్రహ్మదేవుడు ఆజ్ఞతో దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో శ్రీవరదరాజ స్వామి విగ్రహాన్ని తయారుచేసి ప్రతిష్ఠించారు. అనేక వందల ఏళ్లు ఈ స్వామి పూజలందుకున్నారు. అయితే, 16వ శతాబ్దంలో మహ్మదీయులు దండయాత్రల సమయంలో శ్రీవరదరాజస్వామి […]

40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే 'శ్రీ అత్తి వరదరాజ స్వామి'!
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 10:36 PM

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సుమారు 1000కి పైగా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ వరదరాజ స్వామి దేవాలయం 108 దివ్య తిరుపతులలో ఒకటైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉంటాయి.

బ్రహ్మదేవుడు ఆజ్ఞతో దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో శ్రీవరదరాజ స్వామి విగ్రహాన్ని తయారుచేసి ప్రతిష్ఠించారు. అనేక వందల ఏళ్లు ఈ స్వామి పూజలందుకున్నారు. అయితే, 16వ శతాబ్దంలో మహ్మదీయులు దండయాత్రల సమయంలో శ్రీవరదరాజస్వామి ఆలయం దోపిడీకి గురైంది. అయితే, సంపదలను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదనే ఉద్దేశంతో అక్కడ ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామివారి విగ్రహాన్ని భద్రపరిచారు.

లోపలికి నీళ్లు చేరకుండా వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున దాచిపెట్టారు. అయితే, పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహం గురించి ఆనవాళ్లు తెలియకపోవడంతో పరిస్థితి సర్దుకున్నాక గర్భాలయంలో వేరొక దివ్య మూర్తిని ప్రతిష్ఠించారు. కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనమిచ్చారు. అన్నేళ్లు నీటిలో ఉన్న చెక్కుచెదరని ఆ విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 48 రోజుల పాటు పూజలు నిర్వహించి, తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించేశారు. అలా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి, 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనం ఇచ్చిన శ్రీఅత్తి వరదరాజ స్వామిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత 2019 జులై 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇది ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది.

తొమ్మిది అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం ఈ సమయంలో మొదటి 38 రోజులు శయన భంగిమలోనూ, చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. ఉదయం 6 గం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు.

Related image

Latest Articles
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి