తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబర్ 28న జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈ వివాహంజరగనుంది. అయితే ఈ పెళ్లి ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షే శాఖ పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్‌మేరీ, మర్రెడ్డి దంపతుల కురుడైన చరణ్ రెడ్డితో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది.
కాగా, వీరి నిశ్చితార్థం అక్టోబర్‌లో విద్యానగర్‌లోని ఓ హోటల్ జరిగింది. ప్రత్యూష కుటుంబంతో తమకు చుట్టరికం కూడా ఉందని చరణ్ రెడ్డి బంధువులు చెబుతున్నారు. చరణ్ రెడ్డి అమ్మమ్మ గ్రామం పాటిగడ్డ కావడంతో అక్కడ వివాహం చేస్తున్నారు. డిసెంబర్ 27న బేంగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రధానం నిర్వహించి, 28న పెళ్లి జరిపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానం కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ప్రభుత్వ అధికారులు హాజరు అవుతారని వరుడి బంధువులు తెలిపారు.