వైట్ హౌస్ లో ఇక నాకు అత్యంత ఆప్తుడు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా రాన్  ని నియమించిన జో బైడెన్

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్..వైట్ హౌస్ లో తన చిరకాల ఆప్తుడు రాన్ క్లెయిన్ ని చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించారు. తన అధికారిక హోదాలో ఆయన ఈ నియామకం చేయడం ఇదే మొదటిసారి.

  • Umakanth Rao
  • Publish Date - 10:43 am, Thu, 12 November 20
వైట్ హౌస్ లో ఇక నాకు అత్యంత ఆప్తుడు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా రాన్  ని నియమించిన జో బైడెన్

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్..వైట్ హౌస్ లో తన చిరకాల ఆప్తుడు రాన్ క్లెయిన్ ని చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించారు. తన అధికారిక హోదాలో ఆయన ఈ నియామకం చేయడం ఇదే మొదటిసారి. అనేక సంవత్సరాలుగా తాము కలిసి పని చేశామని, అపారమైన రాన్ అనుభవం, సేవా నిరతి తనను ఆకట్టుకున్నాయని బైడెన్ పేర్కొన్నారు. 2009 లో రాన్ అమెరికా ఉపాధ్యక్షునిగా  వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటు-2014 లో బరాక్ ఒబామా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఎబోలా క్రైసిస్ అదుపునకు రాన్… వైట్ హౌస్ కి, అధికారులకు  మధ్య సమన్వయానికి కృషి చేశారు.  దీంతో  నాడు ముఖ్యంగా ఆఫ్రికాను కబళించిన ఎబోలా చాలావరకు తగ్గుముఖం పట్టింది. తనను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించినందుకు రాన్..బైడెన్ కి కృతజ్ఞతలు తెలిపారు.