ఆ జైలు ఇడ్లీలకు భలే గిరాకీ.. ఎందుకో తెలుసా?

|

Oct 18, 2019 | 4:16 PM

నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చినట్లే ఇడ్లీ ధరలు కూడా ఎప్పుడో పెరిగిపోయాయి. భాగ్యనగరంలో ఇప్పుడు రెండు పెద్ద ఇడ్లీల ధర రూ.40లు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇడ్లీ రేటు సుమారు పాతిక నుంచి రూ.30 వరకు ఉంటుంది. అలాంటిది ఒక చోటు ఇడ్లీలు కేవలం రూ.5కే దొరుకుతున్నాయి. ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారో ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ సెంట్రల్ జైలు సిబ్బంది అక్కడి ప్రజల కోసం […]

ఆ జైలు ఇడ్లీలకు భలే గిరాకీ.. ఎందుకో తెలుసా?
Follow us on

నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చినట్లే ఇడ్లీ ధరలు కూడా ఎప్పుడో పెరిగిపోయాయి. భాగ్యనగరంలో ఇప్పుడు రెండు పెద్ద ఇడ్లీల ధర రూ.40లు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇడ్లీ రేటు సుమారు పాతిక నుంచి రూ.30 వరకు ఉంటుంది. అలాంటిది ఒక చోటు ఇడ్లీలు కేవలం రూ.5కే దొరుకుతున్నాయి. ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారో ఇప్పుడు చూద్దాం.

మహబూబ్ నగర్ సెంట్రల్ జైలు సిబ్బంది అక్కడి ప్రజల కోసం ఇడ్లీలను కారుచౌకగా అమ్ముతున్నారు. వారు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు లాభాల బాట పట్టిన నేపథ్యంలో ఇలా తక్కువ ధరకు టిఫిన్లు అమ్మటం ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.  జైలు ఖైదీలు తయారు చేసిన ఇడ్లీలను కేవలం రూ.5లకే అమ్ముతున్నారు. అటు రుచి.. ఇటు నాణ్యత విషయంలో ఏ మాత్రం తేడా లేకపోవటంతో జైలు ఇడ్లీలకు రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతూ వచ్చింది. వీటికి ప్రొద్దున్నే రద్దీ విపరీతంగా పెరిగింది. మొదటి రోజు 400 మంది కస్టమర్లు వస్తే.. ఈ సంఖ్య మూడో రోజుకు 1100 మందికి చేరింది. మహబూబ్ నగర్ జైలు ఎదుట నిర్వహిస్తున్న ఈ హోటల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది.