హుబ్లీలో ఉన్మాది ఘాతుకం..పట్టపగలు నడిరోడ్డుపై యువతిని నరికిన రాక్షసుడు..

|

Dec 21, 2020 | 5:05 PM

హుబ్లీలో నడిరోడ్డుపై యువతిపై ఉన్మాది దాడికి తెగబడ్డా మొదట ఎవరూ అడ్డుకోలేదు. దీంతో ఆర్తనాదాలు చేస్తున్న యువతిపై కత్తితో దాడికి సైకో తెగబడ్డాడు. చివరికి టూవీలర్‌పై వెళ్లే..

హుబ్లీలో ఉన్మాది ఘాతుకం..పట్టపగలు నడిరోడ్డుపై యువతిని నరికిన రాక్షసుడు..
Follow us on

పట్టపగలు..నడిరోడ్డుపై సైకో రెచ్చిపోయాడు. తల్వార్‌తో విచక్షణారహితంగా యువతిపై దాడి చేశాడు. కర్నాటకలోని హుబ్లీ పట్టణంలో ఈ దారుణం జరిగింది. నిస్సహాయంగా రోడ్డుపై కుప్పకూలిన యువతి మెడ, వీపుపై తల్వార్‌తో నరికాడా రాక్షసుడు.

హుబ్లీలో నడిరోడ్డుపై యువతిపై ఉన్మాది దాడికి తెగబడ్డా మొదట ఎవరూ అడ్డుకోలేదు. దీంతో ఆర్తనాదాలు చేస్తున్న యువతిపై కత్తితో దాడికి సైకో తెగబడ్డాడు. చివరికి టూవీలర్‌పై వెళ్లే ఓ వ్యక్తి వారించటంతో… ఆ ఉన్మాది ఆగిపోయాడు. అయితే అప్పటికే తీవ్రగాయాలతో రక్తపుమడుగులో యువతి కుప్పకూలింది. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా మారింది.

హుబ్లీ పట్టణంలో యువతిపై దాడికి తెగబడిన ఉన్మాదిని ఇస్మాయిల్‌గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడోచోట ప్రేమోన్మాదులు, సైకోలు నిస్సహాయులైన మహిళలపై కత్తులతో విరుచుకుపడుతున్నారు. నిలువునా ప్రాణాలు తీస్తున్నారు రాక్షసులు.