IRCTC: మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?

IRCTC Warns Passengers: మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారు.? ఐఆర్‌సీటీసీ అకౌంట్ కూడా ఉందా.? అయితే ఈ న్యూస్ మీకోసమే. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్ల చేతికి మీ డీటెయిల్స్ అన్నీ చేరిపోతాయని ఐఆర్‌సీటీసీ సంస్థ ప్రయాణీకులను హెచ్చరిస్తోంది. అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డు నెంబర్, పిన్, సీవీవీ, యూపీఐ లాంటి ఇంపార్టెంట్ సమాచారాలను ఫోన్ కాల్, ఈ-మెయిల్స్ ద్వారా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచిస్తోంది. తాము […]

IRCTC: మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?
Follow us

|

Updated on: Mar 03, 2020 | 1:58 PM

IRCTC Warns Passengers: మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారు.? ఐఆర్‌సీటీసీ అకౌంట్ కూడా ఉందా.? అయితే ఈ న్యూస్ మీకోసమే. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్ల చేతికి మీ డీటెయిల్స్ అన్నీ చేరిపోతాయని ఐఆర్‌సీటీసీ సంస్థ ప్రయాణీకులను హెచ్చరిస్తోంది.

అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డు నెంబర్, పిన్, సీవీవీ, యూపీఐ లాంటి ఇంపార్టెంట్ సమాచారాలను ఫోన్ కాల్, ఈ-మెయిల్స్ ద్వారా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచిస్తోంది. తాము ఐఆర్‌సీటీసీ అధికారులమని, బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఎవరైనా కాల్స్ చేసి.. మిమ్మల్ని నమ్మించి మీ వివరాలను అడిగే అవకాశం ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వారితో వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకోకూడదని.. పొరపాటున మీరు చెబితే మాత్రం బ్యాంక్ అకౌంట్లలో సొమ్ము ఖాళీ అయిపోతుందన్నారు.

బ్యాంకు ఖాతా వివరాలు, ఐఆర్‌సీటీసీ అకౌంట్ డీటైల్స్, ఓటీపీ, పాస్‌వర్డ్‌ తదితర అంశాలపై తమ సిబ్బంది ఏ ప్రయాణీకుడికి ఫోన్ చేయదని సంస్థ పేర్కొంది. రీఫండ్స్, టీడీఎస్, ఇ-టికెట్ క్యాన్సలేషన్ లాంటివన్నీ కూడా ఆటోమేటిక్‌గానే జరుగుతాయన్నారు. కాబట్టి ఆ రీ-ఫండ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని ఐఆర్‌సీటీసీ కోరింది.

For More News: 

హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!

రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!

అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!

కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్‌

రౌడీగారు.. మరీ ఇంత నాటీనా.?

మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?

టెస్ట్ ఛాంపియన్‌షిప్.. కోహ్లీసేనకు ముందుంది ముసళ్ల పండగ..!

మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.!