IPL 2024: క్యాచ్ ఆఫ్ ది సీజన్ ఇదే! గాల్లోకి ఎగిరి కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో చూస్తే వావ్ అంటారు

ఐపీఎల్ 17వ సీజన్‌లో 54వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్‌పై ఏకంగా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ తరఫున సునీల్ నరైన్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌ గా నిలిచాడు చేశాడు. లక్నో తరఫున నవీన్ ఉల్ హక్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

IPL 2024: క్యాచ్ ఆఫ్ ది సీజన్ ఇదే! గాల్లోకి ఎగిరి కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో చూస్తే వావ్ అంటారు
Ramandeep Singh
Follow us

|

Updated on: May 06, 2024 | 6:02 PM

ఐపీఎల్ 17వ సీజన్‌లో 54వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్‌పై ఏకంగా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ తరఫున సునీల్ నరైన్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌ గా నిలిచాడు చేశాడు. లక్నో తరఫున నవీన్ ఉల్ హక్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీంతో భారీ షాట్లకు యత్నించి వికెట్ల సమర్పించుకున్నారు.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ చివరి బంతికి మిచెల్ స్టార్క్ 139.2 కి.మీ వేగంతో బౌలింగ్ చేశాడు. అర్షిన్ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అర్షిన్ బ్యాట్‌కు ఎడ్జ్ అవుతూ గాల్లోకి లేచింది. అంతే రమణ్ దీప్ సింగ్ 21 మీటర్లు వెనక్కు పరిగెత్తి గాలిలో దూకి ఊహించని క్యాచ్ అందుకున్నాడు. రమణదీప్ సింగ్ పట్టిన క్యాచ్ చూసి అర్షిన్ కులకర్ణి కూడా ఆశ్చర్యపోయాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రమణదీప్ సింగ్ పట్టిన క్యాచ్ తో అర్షిన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. అర్షిన్ 7 బంతుల్లో 2 ఫోర్లతో 128.57 స్ట్రైక్ రేట్‌తో 9 పరుగులు చేశాడు. కాగా . రమణదీప్ సింగ్ తీసుకున్న క్యాచ్ ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 81, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరిలో శ్రేయస్ అయ్యర్ (23), రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడాడు. ఇక లక్ష్య ఛేదనలో లక్నో 16.1 ఓవర్లలో కేవలం 137 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. మార్కస్ స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ (21 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లు), కేఎల్ రాహుల్ ‌‌‌‌‌‌‌ (21 బంతుల్లో ‌ 3 ఫోర్లతో 25) మాత్రమే పోరాడారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో లక్నో ఏకంగా 98 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

ఇవి కూడా చదవండి

రమణ్ దీప్ సింగ్ క్యాచ్.. వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..