కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతిపై మెరుపు కోసం ఉమ్మిని(సలైవా) రుద్దకూడదని ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ రూల్ అతిక్రమిస్తే శిక్షలు ఏంటో చెప్పింది. నిబంధన గురించి మర్చిపోయాడో, లేక లైట్ తీసుకున్నాడో తెలియదు కానీ.. బంతికి ఉమ్మి రాస్తూ కెమెరాకు చిక్కాడు రాబిన్ ఉతప్ప.
దుబాయ్ వేదికగా గురువారం రాత్రి.. రాజస్థాన్, కోల్‌కతా నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి స్టీవ్‌స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (47), మోర్గాన్ (34*), రసెల్ (24), నితీశ్ రాణా (22), రాణించడం వల్ల 6 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది కోల్‌కతా. ఛేజింగ్ లో రాజస్థాన్ తేలిపోయింది. 42 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. స్మిత్, సంజు, తెవాతియా, ఉతప్ప ఫెయిలయ్యారు. టామ్ కరణ్ (54*) హాఫ్ సెంచరీ చేయడమే ఆ జట్టుకు ఊరట. మిగతా ప్లేయర్స్ పెద్దగా రన్స్ చేయకపోవడం వల్ల 137/9కే పరిమితమైంది.
కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రాజస్థాన్ ఫీల్డర్ రాబిన్ ఉతప్ప బంతికి లాలాజలం రుద్దాడు. మూడో ఓవర్ ఐదో బంతికి నరైన్ క్యాచ్‌ను అతడు చేజార్చాడు. ఆ తర్వాత బంతికి ఉమ్మి రుద్దుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బంతికి ఫీల్డర్ ఉమ్మి రుద్దితే అంపైర్లు కలగజేసుకొంటారు. బంతిని శానిటైజ్ చేయిస్తారు. ఫస్ట్ టైమ్ ఫీల్డర్‌కు నిబంధనలను వివరిస్తారు. వరుసగా రెండుసార్లు చేస్తే వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాతా అలాగే చేస్తే శిక్షగా ప్రత్యర్థికి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు.
Robin Uthappa just used saliva on the cricket ball. Is it not banned by @ICC#RRvKKR#IPL2020 @bhogleharsha pic.twitter.com/EWilsl9Z01
— बेरोज़गार (@ItsRaviMaurya) September 30, 2020