Dhoni In IPL : స్టేడియం బయటకు బంతి : ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

ఎం.ఎస్ ధోని అంటే సిక్సర్లకు మారు పేరు. మాములు మ్యాచుల్లోనే చెలరేగే ఆడే ధోని, ఐపీఎల్ అంటే మరింత రెచ్చిపోతాడు. తన మార్క్ హెలికాప్టర్ షాట్లతో విరుచుకుపడతాడు.

Dhoni In IPL : స్టేడియం బయటకు బంతి : ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
Follow us

|

Updated on: Sep 23, 2020 | 5:14 PM

ఎం.ఎస్ ధోని అంటే సిక్సర్లకు మారు పేరు. మాములు మ్యాచుల్లోనే చెలరేగే ఆడే ధోని, ఐపీఎల్ అంటే మరింత రెచ్చిపోతాడు. తన మార్క్ హెలికాప్టర్ షాట్లతో విరుచుకుపడతాడు. తాజా ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని చివరి ఓవర్ లో సిక్సర్లతో దుమ్ములేపాడు. సూపర్ కింగ్స్ ఓడినా..  పరుగుల మధ్య అంతరం ఎక్కువ లేకుండా ఉండటానికి ధోని హిట్టింగే కారణం. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో జరిగిన ఓ ఇంట్రస్టింగ్ సన్నివేశాన్ని ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు నిర్వాహకులు. ఆ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్రాన్ వేసిన ఓ బంతిని ధోనీ లాంగ్ ఆన్ దిశగా బలంగా బాదాడు. 92 మీటర్ల పైగా వెళ్ళిన ఆ బంతి స్టేడియం బయటకు వెళ్లి రోడ్డు మీద పడింది. దాన్ని చూసిన ఓ వ్యక్తి ఆనందంతో ఆ బంతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సులు బాది  అభిమానులను అలరించాడు ధోని. ఈ మ్యాచ్‌లో మొత్తం 33 సిక్సర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్, ధోనీ, జోఫ్రా ఆర్చర్, డుప్లీసిస్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించారు.

Also Read :

ఏపీ : టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులకు గ్రేడులు కేటాయిస్తూ ఉత్తర్వులు

కేబీఆర్ పార్క్ మూసివేత : హైకోర్టు నోటీసులు

సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం