దేశంలో కొత్తగా 63,371 మందికి కరోనా.. 895 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటంలేదు. రోజు రోజుకీ నమోదు అవుతున్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.

దేశంలో కొత్తగా 63,371 మందికి కరోనా.. 895 మంది మృతి
Follow us

|

Updated on: Oct 16, 2020 | 10:54 AM

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటంలేదు. రోజు రోజుకీ నమోదు అవుతున్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. నిన్నటితో పోల్చితే కాస్త తక్కువమందికి కరోనా నిర్ధారణ అయ్యినట్లు అధికారు చెబుతున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో గురువారం 10,28,622 మంది నుంచి తీసిన నమూనాలను పరీక్షించగా.. 63,371 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కు చేరుకుంది. ఇక 24 గంటల్లో 895 మంది కరోనా బారినపడి మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,161కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 70,338 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 64,53,779 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 8,04,528 క్రియాశీల కేసులు ఉండగా ఎక్కువ శాతం హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనా చికిత్స పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది.

మరోవైపు రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వస్తుంది. దాదాపు 87.56 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.92 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,22,54,927 నమూనాలను పరీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా, బయట తిరిగే వారు ఖచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Latest Articles
ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి..
ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి..
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.