ఓపెనర్‌గా రో’హిట్’.. సఫారీలకు ఇక చుక్కలే…!

|

Oct 02, 2019 | 4:04 PM

వన్డేల్లో టీమిండియాకు ఓపెనర్‌గా ప్రాతినిధ్యం వహించి ఎన్నో రికార్డు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా దిగి సఫారీలను ఆట ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో హిట్‌మ్యాన్ అద్భుత (115; 174 బంతుల్లో, 12×4, 5×6) శతకం సాధించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ (84; 183 బంతుల్లో 11×4, 2×6)తో కలిసి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. ఈ ఇద్దరూ సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ […]

ఓపెనర్‌గా రోహిట్.. సఫారీలకు ఇక చుక్కలే...!
Follow us on

వన్డేల్లో టీమిండియాకు ఓపెనర్‌గా ప్రాతినిధ్యం వహించి ఎన్నో రికార్డు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా దిగి సఫారీలను ఆట ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో హిట్‌మ్యాన్ అద్భుత (115; 174 బంతుల్లో, 12×4, 5×6) శతకం సాధించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ (84; 183 బంతుల్లో 11×4, 2×6)తో కలిసి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు.

ఈ ఇద్దరూ సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 202 పరుగులకు చేరింది. అయితే వర్షం రావడంతో ఎంపైర్లు ఈ రోజు ఆటని ముగించారు. అటు సఫారీ బౌలర్లు ఈ ద్వయాన్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమయ్యాయని చెప్పొచ్చు.

ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మ దాదాపు మూడేళ్ళ తర్వాత టెస్టుల్లో సెంచరీ నమోదు చేయడం విశేషం. దీంతో రోహిత్ శర్మ ఇప్పటివరకు టెస్టుల్లో 4 శతకాలు బాదాడు.

దాదాపు 6 ఏళ్ళ క్రిందట టెస్ట్ కెరీర్ స్టార్ట్ చేసిన రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. టీమ్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మను ఓపెనర్‌గా కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ప్రయత్నించింది. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లు ఓపెనర్‌లుగా విఫలం కావడంతో రోహిత్ శర్మను ఆ స్థానంలో ముందుకు తీసుకొచ్చారు.

ఎప్పుడెప్పుడా అని అవకాశం కోసం ఎదురుచూస్తున్న రోహిత్ శర్మ.. ఛాన్స్ దొరకగానే తన పరుగుల దాహాన్ని తీర్చుకోవడమే కాకుండా క్రిటిక్స్‌కు సరైన గుణపాఠం చెప్పాడు.