India Vs Australia 2020: ముగిసిన మొదటి రోజు ఆట… భారత్ స్కోర్ 36 పరుగులకు ఒక వికెట్…

| Edited By:

Dec 26, 2020 | 1:38 PM

భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

India Vs Australia 2020: ముగిసిన మొదటి రోజు ఆట... భారత్ స్కోర్ 36 పరుగులకు ఒక వికెట్...
Follow us on

భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో బుమ్రాకు 4, రవిచంద్రన్ అశ్విన్‌కు 3, మహ్మద్ సిరాజ్‌కు 2, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ లభించాయి. ఇక ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లలో వేడ్ 30, లబు షేన్ 48, హెడ్ 38 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించారు.

 

శుభారంభం లభించలేదు…

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. పరుగులు ఏమీ చేయకుండానే భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్(0) ఔట్ అయ్యాడు. ఆసిస్ బౌలర్ స్టార్ బౌలింగ్‌లో ఎల్బీ డబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 11 ఓవర్లలో 36 పరుగులు సాధించి ఒక వికెట్‌ను కోల్పోయింది. క్రీజులో శుభమన్ గిల్(28), పుజారా(7) ఉన్నారు. ఆసీస్ బౌలర్ స్టార్క్‌కు వికెట్ దక్కింది. కాగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు వెనకబడి ఉంది.