
India Vs Australia 2020: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 98/2 తో ఐదవ రోజు సోమవారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ను.. వికెట్ కీపర్ రిషబ్ పంత్(97), పుజారా(58*) విజయానికి మరింత దగ్గర చేశారు. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే (4) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టిన.. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్(97) తనదైన శైలి ఆటతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడటమే కాకుండా పుజారాతో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే సెంచరీకి చేరువయ్యే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్.. కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ అప్పటికే దాదాపు ఈ ద్వయం.. టీమిండియాను పటిష్ట స్థితిలో నిలబెట్టారు. ప్రస్తుతం పుజారా(58), విహారి(0)లు క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 157 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేయగా..భారత్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 312 రన్స్ చేసి టీమిండియా ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.