India Vs Australia 2020: బాక్సింగ్ డే టెస్టు విజయంతో ఊపుమీద ఉన్న టీమిండియా మూడో టెస్టులో విజయం సాధించాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే పిక్క గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగిన ఉమేష్ యాదవ్ స్థానంలో.. యార్కర్ కింగ్ నటరాజన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలు, టీ20ల్లో అదరగొట్టిన నటరాజన్.. టెస్టుల్లో కూడా దుమ్ములేపుతాడని జట్టు యాజమాన్యం అనుకుంటోంది.
వాస్తవానికి వన్డేలు అనంతరం నటరాజన్ స్వదేశానికి రావాల్సి ఉంది. అయితే అతడ్ని నెట్ బౌలర్‌గా బీసీసీఐ ఆస్ట్రేలియాలోనే టీమ్‌తో ఉంచింది. ఇతర ప్లేయర్లకు గాయాలు కావడంతోనే వన్డేలు, టీ20ల్లో అరంగేట్రం చేసిన నటరాజన్.. ఇప్పుడు అదే విధంగా టెస్టుల్లోనూ డెబ్యూ కానున్నాడు.
NEWS: T Natarajan to replace Umesh Yadav in India’s Test squad. #TeamIndia #AUSvIND
Details ? https://t.co/JeZLOQaER3 pic.twitter.com/G9oXK5MQUE
— BCCI (@BCCI) January 1, 2021