India Vs Australia 2020: బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కున్న ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. మూడో టెస్టు మ్యాచ్‌కు ఓపెనర్ డేవిడ్ వార్నర్ అందుబాటులోకి ఉండడని తెలుస్తోంది. వార్నర్ గాయం నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టేలా ఉందని.. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు వార్నర్ కష్టపడుతున్నాడని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ తాజాగా జరిగిన మీడియా కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. దీనితో జనవరి 7 నుంచి మొదలయ్యే మూడో టెస్టులో వార్నర్ ఆడతాడా.? లేడా.? అన్న సందేహాలు మొదలయ్యాయి.
”వార్నర్ చాలా ప్రొఫెషనల్ పర్సన్. రికవర్ అయ్యేందుకు ఏం చెయ్యాలో అన్ని చేస్తున్నాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. ఎలాంటి సమస్యా లేదు. కానీ గ్రోయిన్‌లో ఇబ్బంది మాత్రం ఇంకా తగ్గలేదు. వికెట్ల మధ్య రన్నింగ్, కదలికల్లో మునపటి కంటే మెరుగయ్యాడు. అతి త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉండటంతో ఈలోపు ఏం జరుగుతుందో వేచి చూడాలి” అని లాంగర్ పేర్కొన్నాడు.